క్లినికల్‍ ట్రయళ్ళలో పాల్గొన్న వారికి డిజిటల్‍ పత్రాలు| Digi Certificates for Clinical Trail Persons

Share this & earn $10
Published at : August 25, 2021

కొవిడ్ వ్యాక్సినేషన్ డిజిటల్ సర్టిఫికెట్ల జారీ విషయంలో......... కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు తయారుచేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ లో... పాల్గొన్న వారంతా సర్టిఫికెట్లు పొందవచ్చని ప్రకటించింది. మనదేశంలో తయారైన.... కొవాగ్జిన్ , కొవిషీల్డ్ టీకాల క్లినికల్ ట్రయల్స్ లో దాదాపు 11 వేల 300 మంది పాల్గొన్నారు. వీరందరికీ E-డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను.. కొవిన్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్నవారికి డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు జారీచేయాలని వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు 11 వేల 349 మంది వివరాలను I.C.M.R. అందజేసిందని తెలిపింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ........ కొవిన్ పోర్టల్ తో పాటు............. ఆరోగ్యసేతు, డిజిలాకర్ , ఉమాంగ్ యాప్ ల ద్వారా సర్టిఫికెట్లను పొందవచ్చని ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ల పరిశోధన, చికిత్సలో సహకారం అందించిన వారికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- క్లినికల్‍ ట్రయళ్ళలో పాల్గొన్న వారికి డిజిటల్‍ పత్రాలు| Digi Certificates for Clinical Trail Persons
ETVETV TeluguETV NewsVideo